తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుంభమేళా'పై జునా అఖాడా కీలక నిర్ణయం

కుంభమేళాను తాము శనివారంతో ముగిస్తున్నట్లు జునా అఖాడా ప్రకటించింది. కుంభమేళాలో భక్తుల సంఖ్య లాంఛనప్రాయంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

kumbh mela
కుంభమేళా

By

Published : Apr 17, 2021, 9:08 PM IST

కుంభమేళాలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అఖాడాలలో ఒకటైన జునా అఖాడా కీలక ప్రకటన చేసింది. కుంభమేళాను తాము శనివారంతో ముగిస్తున్నట్లు తెలిపింది. భక్తుల సంఖ్య కొవిడ్ వ్యాప్తికి దారితీయకుండా లాంఛనప్రాయంగా ఉండాలని జునా అఖాడాకు చెందిన స్వామి అవదేశానందగిరిని ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో కోరారు. అనంతరం.. జునా అఖాడా ఈ ప్రకటన చేసింది.

"కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రజల భద్రతే మా మొదటి ప్రాధాన్యత. కుంభమేళాలో మా విధులన్నింటిని పూర్తి చేశాం. ఇది జునా అఖాడా తరపున ముగింపు ప్రకటన."

- స్వామి అవదేశానందగిరి.

హరిద్వార్​లోని కుంభమేళాలో 30 మంది సాధువులు శుక్రవారం కరోనా బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం ఉత్తరాఖండ్​లో ప్రస్తుతం 12,484 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి:కుంభమేళాపై అఖాడాల దారెటు- ముందుగానే ముగిస్తారా?

ABOUT THE AUTHOR

...view details