దేశవ్యాప్తంగా టీకాల కొరతను ఉద్దేశించి కేంద్రంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. "జులై పోయింది.. వ్యాక్సిన్ల కొరత తీరలేదు" అంటూ హిందీలో ట్వీట్ చేసిన రాహుల్.. దీనికి 'టీకాలు ఎక్కడ' అని హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.
గత నెల 2న సైతం ఇలాగే ట్వీట్ చేశారు రాహుల్. "జులై వచ్చింది. వ్యాక్సిన్లు రాలేదు" అని రాహుల్ గతంలో పేర్కొన్నారు.
కాగా, గత నెల 28న రాహుల్ టీకా తీసుకున్నట్లు పార్టీలు వర్గాలు తెలిపాయి. అందుకే 29, 30 తేదీల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రాహుల్ హాజరుకాలేదని పేర్కొన్నాయి. ఏప్రిల్ 20న రాహుల్ కరోనా బారిన పడటం వల్ల వ్యాక్సిన్ తీసుకోవడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది.
రాహుల్ జీ.. మీరూ టీకా వేసుకున్నారట కదా?