నేటి రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..
మేషం
చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా.. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. శివారాధన శుభప్రదం.
వృషభం
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తలపెట్టిన పనులు త్వరగా పూర్తిచేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుజ ధ్యానం చేయడం మంచిది.
మిథునం
చక్కని విజయావకాశాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవాలి.
కర్కాటకం
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తోటివారిని కలుపుకొనిపోతే మంచిది. దుర్గాదేవి ఆరాధన శుభదాయకం.
సింహం
మంచి భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.
కన్య
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.