తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 24 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - ఈ రోజు రాశి ఫలాలు

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE NEWS
రాశి ఫలాలు

By

Published : Jul 24, 2021, 4:32 AM IST

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలు ఒత్తిడిని పెంచుతాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగండి. మేలు జరుగుతుంది. దైవారాధన మనశ్శాంతినిస్తుంది. దుర్గారాధన శుభప్రదం.

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహకారం అందుకుంది. మనస్సౌఖ్యం ఉంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. యశస్సు వృద్ధి చెందుతుంది. గోసేవ చేస్తే బాగుంటుంది.

అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగాలంటే వెంకటేశ్వరుణ్ణి పూజించాలి.

శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. ఇష్టదేవతా నామాన్ని జపించాలి.

అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణ సౌఖ్యం ఉంది. లక్ష్మీ అష్టోత్తరం చదవడం ఉత్తమం.

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్య పనులను త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details