ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
మేషం
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. చంద్రధ్యానం శుభప్రదం.
వృషభం
అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
మిథునం
దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.
కర్కాటకం
పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
సింహం
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. చతుర్ధ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గా ఆరాధన మంచిది.
కన్య
శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలను అందుకుంటారు. అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. దుర్గాస్తుతి పఠించాలి.
తుల
మిశ్రమకాలం. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మంచినిస్తాయి.
వృశ్చికం
మనఃసౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ధన,ధాన్య లాభాలు ఉన్నాయి. సత్యనిష్ఠతో విజయసిద్ధి ఉంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.
ధనుస్సు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధు,మిత్రులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగ్రహావేశాలకు పోకూడదు. శని శ్లోకం చదవాలి.
మకరం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అన్నివిధాలా బాగుంటుంది. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.
కుంభం
బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.
మీనం
మీ మీ రంగాల్లో మీ శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. గణపతిని పూజిస్తే మంచిది.