తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5జీ రద్దు పిటిషన్​ను ఉపసంహరించుకున్న జూహీ చావ్లా - దిల్లీ హైకోర్టు

5జీ నెట్​వర్క్​పై వేసిన పిటిషన్​ను ఉపసంహరించుకున్నారు బాలీవుడ్​ నటి జూహీ చావ్లా. ఇందుకు జస్టిస్​ జయంత్​నాథ్​ అనుమతించినట్లు చావ్లా తరఫు న్యాయవాది దీపక్​ ఖోస్లా తెలిపారు.

Juhi Chawla
జూహీ చావ్లా

By

Published : Jul 29, 2021, 7:22 PM IST

5జీ వైర్​లెస్​ నెట్​వర్క్​కు వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్​ను​ ఉపసంహరించుకున్నారు నటి జూహీ చావ్లా. ఈ పిటిషన్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. కొట్టివేసింది. దీంతో చావ్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పిటిషన్​ ఉపసంహరణకు జస్టిస్​ జయంత్​నాథ్​ అనుమతించినట్లు చావ్లా తరఫు న్యాయవాది దీపక్​ ఖోస్లా తెలిపారు.

"చావ్లా న్యాయవాది అప్పీలేట్ కోర్టులో పిటిషన్​ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నారు. దీంతో పిటిషన్​ను కొట్టివేస్తున్నాం" అని కోర్టు తెలిపింది. అయితే పౌర స్మృతి​ ప్రకారం తిరస్కరించవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు.. అంతేకానీ కొట్టివేయకూడదు అని చావ్లా న్యాయవాది వాదించారు.

5జీ టెక్నాలజీ వల్ల పౌరుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో.. దానిని వ్యతిరేకిస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్​ వేశారు నటి జూహీ చావ్లా. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మీడియా పబ్లిసిటీ కోసమే ఈ పిటిషన్​ను దాఖలు చేశారని మండిపడింది. రూ.20 లక్షలు జరిమానా సైతం విధించింది.

ఇదీ చూడండి:5జీ నెట్​వర్క్​​ వద్దంటూ హైకోర్టుకు ప్రముఖ నటి

ABOUT THE AUTHOR

...view details