తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5జీ కేసులో హీరోయిన్​కు షాక్​- ఎన్ని లక్షలు ఫైన్​ అంటే... - 5జీపై దిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు

5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీ చావ్లా దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. రూ.20 లక్షలు జరిమానా సైతం విధించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రచారం కోసమే పిటిషన్‌ వేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది.

juhi chawla
జూహీ చావ్లా

By

Published : Jun 4, 2021, 5:20 PM IST

Updated : Jun 4, 2021, 6:32 PM IST

5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌ అయిన నటి జుహీ చావ్లాకు రూ.20 లక్షలు జరిమానా విధించింది. ప్రచారం కోసమే పిటిషన్‌ వేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది.

కోర్టు వాదనల లింక్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన జుహీ చావ్లాపై కోర్టు మండిపడింది. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేశారని ఘాటుగా స్పందించింది. ఓ వ్యక్తి పాటలు పాడడం వల్ల కేసు వాదనలకు మూడుసార్లు అంతరాయం కలిగిందన్న దిల్లీ హైకోర్టు.. అందుకు కారకులను గుర్తించాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది.

Last Updated : Jun 4, 2021, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details