లక్షల్లో విలువ ట్రాక్టర్‌ను కొనే స్తోమత లేని రైతులు.. సాగుకు మరో ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. అయితే మధ్యప్రదేశ్ విదిశా జిల్లా ఘట్వాయీ గ్రామానికి చెందిన విజయ్ సింగ్ రఘువంశీ అనే రైతు భిన్నంగా ఆలోచించాడు. ఆటో ఇంజిన్‌తో ఓ మినీ ట్రాక్టర్‌ను రూపొందించాడు. ఇందుకు అతనికి అయిన ఖర్చు కేవలం రూ. 25వేలు.
తయారీ ఇలా..
పాడైపోయిన ఆటో నుంచి ఇంజిన్ కొనుగోలు చేసిన విజయ్ సింగ్.. దానిని స్థానిక మెకానిక్‌తో బాగుచేయించాడు. తానే సొంతంగా ట్రాక్టర్ బాడీ రూపకల్పన చేశాడు. ఇంజిన్ అమర్చి, బాడీకి మూడు చక్రాలు బిగించి మినీ ట్రాక్టర్‌ను సిద్ధం చేశాడు. ఈ కొత్త యంత్రంతో విజయ్‌కు.. తన 1.5 ఎకరాల భూమిలో సాగు సులభం అవుతోంది. దీనితో 3 గంటల్లో పావు ఎకరాన్ని దున్నవచ్చు. ఇందుకు కేవలం ఒకటిన్నర లీటర్ల డీజిల్ అవసరం అవుతుందని విజయ్ సింగ్ వెల్లడించాడు.
గ్యాస్‌తోనూ..