తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్టుకు డుమ్మా కొట్టిన వైఎస్సార్సీపీ నేత-అయితేనేం ఆయన స్థానంలో డ్రైవర్ హాజరు పరిచారు! - అవుతు శ్రీనివాస రెడ్డిపై జడ్జి సీరియస్

Judge Fire on YSRCP Leader: ఏపీలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఓ అరుదైన ఘటన జరిగింది. గతంలో నమోదైన కేసు విషయంలో కోర్టుకు ఓ వైఎస్సార్సీపీ నేత హాజరు కావాల్సి ఉంది. కానీ ఆ నేత హాజరు కాకుండా డుమ్మా కొట్టి, ఆయన స్థానంలో డ్రైవర్​ను పంపారు. విషయం బయటపడటంతో ఆ నేత కోర్టుకు వచ్చి క్షమాపణలు చెప్పారు. ఆ నేత ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే మరీ.

Judge_Fire_on_YSRCP_Leader
Judge_Fire_on_YSRCP_Leader

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 1:28 PM IST

Judge Fire on YSRCP Leader :ఏపీలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఎవ్వరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. గతంలో నమోదైన కేసు విషయంలో కోర్టుకు హాజరు కావాల్సిన వైఎస్సార్సీపీ నేత ఆయన డ్రైవర్​ను కోర్టులో హాజరు పరిచారు. ఆఖరి నిమిషంలో విషయం బహిర్గతం కావడంతో అక్కడున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జడ్డీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పి అక్కడ నుంచి జారకున్నారు. ఆయన ఎవరో కాదు విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి (Vijayawada Deputy Mayor Sailaja Reddy) భర్త, వైఎస్సార్సీపీ నేత అవుతు శ్రీనివాసరెడ్డి. అసలు ఆయనపై ఏం కేసు నమైదైంది? కోర్టులో ఉన్న అధికారులు ఈ విషయాన్ని ఎలా బయటపెట్టారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్టోరీ చదవండి మరీ.

Judge Serious on Vijayawada Deputy Mayor Husband Avuthu Srinivasa Reddy :కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ 2015 ఆగస్టు 29న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. ఇందులో 9 మందిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో డిప్యూటీ మేయర్‌ భర్త అవుతు భర్త శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. ఈ కేసు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఇప్పటికీ విచారణ సాగుతోంది. మంగళవారం కోర్టు వాయిదాకు శ్రీనివాసరెడ్డి హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన హాజరు కాకుండా డ్రైవర్‌ మురారిని పంపించారు.

shop vandalized: రెచ్చిపోయిన వైసీపీ నేత.. కోర్టు స్టే ఉన్నా దౌర్జన్యం

మా ఓనర్ వాష్‌రూమ్​లో ఉన్నారు అందుకే నన్ను పంపారు : ఈ కేసులో విచారణ కోసం కోర్టు గుమస్తా నిందితుల పేర్లు పిలుస్తుండగా, శ్రీనివాసరెడ్డి బదులుగా మురారి కోర్టు హాలులోకి ప్రవేశించారు. దీంతో మురారి తడబడుతుండడం, వయసు తేడా ఉండడంతో కోర్టు సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ని ప్రశ్నించారు. తాను శ్రీనివాసరెడ్డిని కాదనీ, ఆయన వాష్‌రూమ్‌కు వెళ్లడంతో తాను వచ్చానని మురారి సమాధానం ఇచ్చారు.

కోర్టు ధిక్కరణ - గుంటూరు మున్సిపల్ కమిషనర్​కు జైలుశిక్ష!

సంజాయిషీ లేఖ ఇచ్చి జారుకున్న అవుతు శ్రీనివాసరెడ్డి : ఈ విషయంపై ఆగ్రహించిన జడ్జి గాయత్రీ దేవి శ్రీనివాసరెడ్డిని పిలిపించాలని అధికారులను ఆదేశించారు. కొద్ది సేపటికి ఆయన కోర్టులో హాజరయ్యారు. కోర్టులంటే ఆషామాషీ అనుకుంటున్నారా అని న్యాయమూర్తి గాయత్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే న్యాయవాదికి చెప్పాలి కానీ, వేరొకరిని పంపించడమేంటని నిలదీశారు. చివరకు క్షమాపణ చెప్పారు. అనంతరం సంజాయిషీ లేఖ తీసుకొని పంపించారు.

ప్రజాప్రతినిధుల పెండింగ్ కేసులపై హైకోర్టులో విచారణ - పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details