JP NADDA NEWS: రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సమన్వయ కమిటీతో భేటీ అయ్యారు. 14 మంది సభ్యులున్న ఈ కమిటీ కన్వీనర్ గజేంద్ర షెకావత్ సహా పార్టీ ప్రధాన కార్యదర్శులు సీటీ రవి, వినోద్ తవాడే, కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, అర్జున్ మేఘ్వల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా అధికార ఎన్డీఏలోని భాగస్వామ్యపక్షాలు, విపక్ష పార్టీలతో చర్చించే బాధ్యతను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కొన్ని రోజుల క్రితం పార్టీ అప్పగించింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులను నడ్డా, రాజ్నాథ్ సింగ్ కలిశారు.