మహారాష్ట్ర మలాద్కు చెందిన దంపతులు కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కార్మికుల కడుపు నింపుతున్నారు. కరోనా ఆంక్షలతో రూపాయి ఆదాయం లేకపోయినా.. వేల మంది పేదలకు ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఉపాధి లేకపోయినా..
మహారాష్ట్ర, మలాద్లోని అంబోజ్వాడీ ప్రాంతానికి చెందిన ఫయాజ్ షేక్, మిజ్గా దంపతులు. ఫయాజ్ షేక్.. ఓ సుగంధ ద్రవ్యాల సంస్థలో పనిచేసేవారు. కరోనా సంక్షోభం కారణంగా గతేడాది అతని ఉద్యోగం పోయింది. ఆ తర్వాత ఫయాజ్ తన ఇంటినిర్మాణం కోసం ప్రావిడెంట్ ఫండ్లో దాచుకున్న రూ. 5 లక్షలను.. పేదలు, వలసకార్మికుల ఆకలి తీర్చేందుకు ఖర్చుచేస్తున్నారు.