తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతం - ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా పాంపొరా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో(Pulwama encounter) ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలం నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు తెలిపాయి.

Pampore gunfight
కశ్మీర్​లో ఎన్​కౌంటర్

By

Published : Aug 20, 2021, 11:42 AM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత(Encounter in kashmir) కొనసాగుతోంది. పుల్వామా జిల్లా, అవంతిపొరాలో జరిగిన ఎదురుకాల్పుల్లో(Pulwama Encounter) ఇద్దరు హిజ్బుల్​ ముజాహిద్దీన్​ ఉగ్రవాదులు హతమయ్యారు.

జిల్లాలోని పాంపొరా ప్రాంతంలో ఉగ్రమూకలు నక్కి ఉన్నాయన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా.. ప్రతిఘటించిన దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఘటనాస్థలం నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

" అవంతిపొరాలోని ఖ్రూ ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్​లో పౌరులను పొట్టనబెట్టుకుంటున్న హిజ్బుల్​ ముజాహిద్దీన్​ ముఠాకు చెందినవారిగా తెలిసింది. ఒక ఏకే రైఫిల్​, ఒక పిస్టోల్​ స్వాధీనం చేసుకున్నాం "

- దిల్బాగ్​ సింగ్​, జమ్ముకశ్మీర్​ డీజీపీ.

బలగాల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు ముసాయిబ్​ ముస్తాక్​ అని,.. ఈ ఏడాది జులై 23న పాస్తునాలోని ప్రభుత్వ పాఠశాల ప్యూన్​ను హత్యచేశాడని కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఉగ్ర ఘాతుకం- ముష్కరుల కాల్పుల్లో మరో నేత మృతి

ABOUT THE AUTHOR

...view details