జమ్ముకశ్మీర్ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. తనను, తన కుమార్తె ఇల్తీజాను గృహనిర్బంధం చేశారన్న ముఫ్తీ వాదనను పోలీసులు ఖండించారు. వారిని తాము హౌస్ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తన సందర్శనను వాయిదా వేయాలని మాత్రమే సూచించామని చెప్పారు.
అంతకుముందు.. గుప్కార్ ప్రాంతంలోని ఫెయిర్‌వ్యూ నివాసంలో ముఫ్తీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆమె నివాసానికి 100 మీటర్ల దూరంలోనే పాత్రికేయులను కట్టడి చేశారు. అయితే.. తమ పైఅధికారుల ఆదేశాలతోనే విలేకరులతో మాట్లాడేందుకు ముఫ్తీని అనుమతించలేదని పోలీసులు తెలిపారు. దీనిపై మెహబూబా ముఫ్తీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్ ఒక బహిరంగ జైలు అని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
"శ్రీనగర్‌లోని నా నివాసంలోకి రాకుండా అధికారులు అడ్డుకున్నారు. ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేనప్పటికీ నన్ను నిర్బంధించారు. కశ్మీర్ ఒక బహిరంగ జైలు, ఇక్కడ ఎవరికీ తమ అభిప్రాయాన్ని తెలియజేసే హక్కు లేదు.