జమ్ము కశ్మీర్ బారాముల్లా జిల్లాలో సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఓ ముష్కరుడిని మట్టుబెట్టాయి. (encounter in Kashmir) చొరబాటును అడ్డుకునే క్రమంలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు. (encounter in Kashmir today)
ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి ఉరీ సెక్టార్లో (Uri sector Today news) శనివారం చొరబాటు వ్యతిరేక ఆపరేషన్ను భద్రత దళాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో పలువురు ముష్కరులు దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు.