జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాతృమూర్తి గుల్షన్ నాజిర్ పాసుపోర్టు కోసం దాఖలు చేసిన దరఖాస్తు తిరస్కరణకు గురయింది. మక్కా సందర్శనకు వెళ్లాల్సి ఉందంటూ గత ఏడాది డిసెంబరులో ఆమె ఈ దరఖాస్తు చేసుకున్నారు. జమ్ముకశ్మీర్ పోలీస్ విభాగం ఇచ్చిన ప్రతికూల నివేదిక వల్ల పాస్‌పోర్ట్ జారీ చేయలేకపోతున్నామని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారులు ఒక లేఖ ద్వారా గుల్షన్ నాజిర్‌కు తెలియజేశారు. పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్ 6(2)కి దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
మెహబూబా ముఫ్తీ తల్లికీ పాసుపోర్టు తిరస్కరణ - jammu kashmir police about mahabooba mufti
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాతృమూర్తి గుల్షన్ నాజిర్ పాసుపోర్టు కోసం చేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైంది. పోలీసులు ఇచ్చిన ప్రతికూల నివేదిక వల్ల ఆమె పాసుపోర్టును అధికారులు తిరస్కరించారు.
మెహబూబా ముఫ్తీ తల్లికీ పాసుపోర్టు తిరస్కరణ
మెహబూబా ముఫ్తీ పాస్‌పోర్టు దరఖాస్తు కూడా ఇదే కారణాలతో అధికారులు తిరస్కరించారు. విదేశాల్లో భారతదేశ వ్యతిరేక ప్రచారం, దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యక్తులకు పాస్‌పోర్టును నిరాకరించే అధికారం చట్టంలోని నిబంధనల ప్రకారం అధికారులకు ఉంటుంది.