తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామాలో భారీ ఎన్​కౌంటర్​.. లష్కరే టాప్​ కమాండర్​ హతం! - లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముగ్గురు హతం

JK encounter: జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో భారీ ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో లష్కరే తోయిబాకు చెందిన డిప్యూటీ కమాండర్​ సహా మరో ఇద్దరు ముష్కరులను హతమార్చాయి బలగాలు.

jk encounter
జమ్ముకశ్మీర్

By

Published : Apr 24, 2022, 8:44 PM IST

Updated : Apr 24, 2022, 9:35 PM IST

JK encounter: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే తోయిబాకు డిప్యూటీ కమాండర్​ ఇన్​ చీఫ్​ ఆరిఫ్​ హజార్​ సహా మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని సైనికాధికారులు తెలిపారు.

తొలుత పుల్వామాలోని పాహు ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ నేపథ్యంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిఘటించిన బలగాలు​.. వారికి దీటుగా బదులిచ్చి ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి.

ఇదీ చదవండి:గుట్టుగా రూ.10 నకిలీ నాణేల ముద్రణ.. ఐదుగురు అరెస్ట్​

Last Updated : Apr 24, 2022, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details