తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఖాతా తెరిచిన కమలం- జమ్ములో జోరు - DDC polls latest results

జమ్ముకశ్మీర్​లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన డీడీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్ములో భాజపా పూర్తి ఆధిపత్యం చూపిస్తోంది. కశ్మీర్​లోనూ ఖాతా తెరిచారు కమలనాథులు. అయితే మొత్తంగా చూసుకుంటే గుప్కార్​ కూటమి అధిక్యంలో ఉండగా... భాజపా గట్టిపోటీ ఇస్తోంది.

JK DDC POLLS
జమ్ములో జోరు- కశ్మీర్​లో ఖాతా తెరిచిన కమలం

By

Published : Dec 22, 2020, 3:56 PM IST

స్వయంప్రతిపత్తి రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో తొలిసారి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన డీడీసీ ఎన్నికల ఫలితాల్లో భాజపా సత్తా చాటుతోంది. గుప్కార్​ కూటమికి గట్టి పోటీ ఇస్తూ కమలనాథులు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా జమ్ములో భాజపా హవా నడుస్తోంది. మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కశ్మీర్​లో మాత్రం గుప్కార్​ కూటమి జోరు చూపిస్తోంది. అయినప్పటికీ కశ్మీర్​ లోయలోనూ భాజపా ఖాతా తెరిచింది.

జమ్ములో భాజపా.. కశ్మీర్​లో గుప్కార్​..

జమ్ము కశ్మీర్​లో డీడీసీల ఏర్పాటు ఇదే మొదటిసారి. ఆర్టికల్​ 370, 35ఏ రద్దు తర్వాత.. తొలిటిసారి ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించి ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. నేషనల్​ కాన్ఫరెన్స్​, పీడీపీ, పీపుల్స్ మూవ్​మెంట్​, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ సహా మరో నాలుగు పార్టీలు కలిసి.. 'పీపుల్స్ అలయన్స్​ ఫర్​ గుప్కార్​ డిక్లరేషన్'​ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా బరిలోకి దిగాయి.

అయితే అంచనాలకు మించి జమ్ములో భాజపా సత్తా చాటుతోంది. గుప్కార్​ కూటమిని వెనక్కి నెట్టి మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. జమ్ములో పార్టీ బలంగా పుంజుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కశ్మీర్​లో మాత్రం గుప్కార్ కూటమి హవా నడుస్తోంది. ఇక్కడ మెజార్టీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ భాజపా ఖాతా తెరవడం గమనార్హం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. ఆర్టికల్​ 370 రద్దు చేసినప్పటికీ ఇక్కడ భాజపా పలు స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.

"కశ్మీర్​ లోయలో భాజపా ఖాతా తెరిచింది. మరికొన్ని చోట్ల కమలం ఆధిక్యం కనబరుస్తోంది. కశ్మీర్​ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారనడానికి ఇది నిదర్శనం."

- షానవాజ్​ హుస్సేన్​, భాజపా నేత

పుంజుకున్న ​కాంగ్రెస్​..

ఇటీవల జరుగుతోన్న పలు ఎన్నికల్లో డీలా పడిన కాంగ్రెస్​.. డీడీసీ ఎన్నికల్లో పుంజుకుంది. పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చేలా జమ్ము, కశ్మీర్​ ప్రాంతాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులు చెప్పుకోదగ్గ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details