జమ్ముకశ్మీర్‌లోని వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి(Drone attack) తర్వాత పలుమార్లు సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్(Jammu and Kashmir) అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్‌లో డ్రోన్లు బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈమేరకు జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఎజాజ్.. శ్రీనగర్‌లో డ్రోన్ సంబంధిత కార్యకలాపాలు జరిపితే కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. డ్రోన్ సరఫరా, అమ్మకం మొదలైన వాటిపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:సరిహద్దులో మరోసారి డ్రోన్ల కలకలం
జిల్లా పరిధిలో జరిగే సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాల్లో డ్రోన్ల వాడకం తప్పనిసరిగా నిలిపివేయాలని ఎజాజ్ తెలిపారు. సరిహద్దుల్లో వైమానిక స్థావరం భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.