తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Jharkhand Train Robbery News : ట్రైన్​లో రెచ్చిపోయిన దొంగలు.. గన్స్​ పేల్చుతూ బెదిరించి, డబ్బు లూటీ

Jharkhand Train Robbery News : ఝార్ఖండ్​లో దొంగలు రెచ్చిపోయారు. తుపాకులతో గుంపుగా వచ్చి ప్రయాణికులను బెదిరించి వారి విలువైన వస్తువులను అపహరించారు. ఝార్ఖండ్​ సంబల్​పుర్​ నుంచి జమ్ములోని తావీకి వెళ్తున్న టాటా మురి ఎక్స్​ప్రెస్​ రైలులో శనివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన.

Jharkhand Train Robbery News In Telugu
Jharkhand Train Robbery News Today

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 6:35 PM IST

Updated : Sep 24, 2023, 7:31 PM IST

Jharkhand Train Robbery News : గన్​లతో వచ్చిన ఓ దొంగల ముఠా రైలులో వెళ్తున్న ప్రయాణికులపై దాడికి దిగింది. వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను అపహరించుకొని పరారయింది. ఝార్ఖండ్​లోని​ సంబల్​పుర్ జంక్షన్​ నుంచి జమ్ములోని తావీకి వెళ్తున్న టాటా మురి ఎక్స్​ప్రెస్​ రైలులో ఈ ఘటన జరిగింది. కాగా, జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రైలు ఉత్తర్​ప్రదేశ్​ సోన్​భద్ర జిల్లాలోని చొపాన్​ జంక్షన్​కు ఉదయం 7:30 నిమిషాలకు చేరుకున్నాక రైల్వే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత ప్రయాణికులు.

పిస్తోళ్ల​తో బెదిరింపులు..
శనివారం అర్ధరాత్రి హఠాత్తుగా 10 నుంచి 12 మందితో కూడిన ఓ దొంగల ముఠా ఝార్ఖండ్​లోని​ లాథేహార్​ రైల్వే స్టేషన్​లో సంబల్​పుర్ జంక్షన్​ నుంచి జమ్ములోని తావీకి వెళ్తున్న టాటా మురి ఎక్స్​ప్రెస్​ రైలులోని స్లీపర్​ క్లాస్​ S-9 బోగీలోకి ఎక్కింది. వెంటనే వారితో తెచ్చుకున్న గన్​లను బయటకు తీసి ఎనిమిది నుంచి పది రౌండ్ల వరకు గాల్లోకి కాల్పులు జరిపి ప్రయాణికులను బెదిరించి వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ట్రైన్​లో ప్రయాణిస్తున్న వారి​ నుంచి పలు విలువైన వస్తువలను లాక్కున్నారు. ఈ క్రమంలో దొంగలకు ఎదురు తిరిగిన కొందరు ప్రయాణికుల​ను తీవ్రంగా కొట్టారు. ఈ ఘర్షణలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. లాథేహార్​ రైల్వే స్టేషన్​లో రైలు ఎక్కిన దొంగలు బర్​వాధీ స్టేషన్​ వచ్చేలోపే దాదాపు 35 నుంచి 40 నిమిషాల్లోనే ఇదంతా పూర్తి చేశారు. అనంతరం స్టేషన్​ రాకముందే ట్రైన్​ చైన్​ లాగి అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత.. బర్​వాధీ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు బాధిత ప్రయాణికులు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాయపడిన వారిని దగ్గర్లోని రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు రెండు గంటల పాటు దాల్తోన్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో ఆగిన రైలు తిరిగి గమ్యస్థానానికి పయనమయింది.

రూ.76 వేలు లూటీ!
ఈ ఘటనలో బాధితుల దగ్గర్నుంచి సుమారు రూ.76,000 నగదు సహా బ్యాగును దొంగలు అపహరించారని అధికారులు గుర్తించారు. ప్రయాణికుల​ బాగోగులు తెలుసుకున్నారు రైల్వే అసిస్టెంట్​ డివిజనల్​ ట్రాఫిక్​ మేనేజర్​ తౌఫిఖుల్లా. అనంతరం వారికి స్నాక్స్​, ఆహారం, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేశారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఝార్ఖండ్​ పోలీసులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.​

"ఈ దోపిడి టాటా మురి ఎక్స్​ప్రెస్​లో జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అలాగే 13 మంది ప్రయాణికుల​ నుంచి రూ.75,800 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో పాటు 8 మొబైల్​ ఫోన్​లను కూడా అపహరించారు. టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకునే పనిలో ఉన్నాము."

- అమ్రేష్​ కుమార్​, ధన్​బాధ్​ సీనియర్​ డివిజనల్​ కమర్షియల్ మేనేజర్​

Last Updated : Sep 24, 2023, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details