Jharkhand Train Accident : పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఝార్ఖండ్ సెరైకెలా-ఖర్స్వాన్ జిల్లాలోని గమ్హారియా రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. అయితే ఈ ప్రమాద ఘటనను రైల్వే అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.
రైలు ఢీకొని నలుగురు మృతి- ట్రాక్ దాటుతుండగా ప్రమాదం - Jharkhand Train Accident
Jharkhand Train Accident : ఝార్ఖండ్‌లోని సెరైకెలా జిల్లాలో ఘోరం జరిగింది. పట్టాలు దాటుతున్న నలుగురు పాదచారులను ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
Published : Jan 18, 2024, 8:56 PM IST
|Updated : Jan 18, 2024, 9:20 PM IST
'పొగమంచు కారణంగానే ప్రమాదం' :ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు టాటానగర్ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలో దట్టమైన పొగమంచు అలుముకున్నట్లు వారు చెప్పారు. ఈ క్రమంలోనే పట్టాలు దాటుతున్న నలుగురు ప్రయాణికులను రైలు ప్రమాదవశాత్తు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా అక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిన వెంటనే మృతదేహాలు ట్రాక్‌పైనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తోటి ప్రయాణికులు పేర్కొన్నారు.
ఇక ఈ ప్రమాద ఘటనపై టాటానగర్ ఆర్పిఎఫ్ విభాగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ట్రాక్‌పై పడి ఉన్న మృతదేహాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. ఈ ఘటన రైల్వే పోల్ నెం.260/20 సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది.