దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉన్న వేళ చాలా రాష్ట్రాల్లో టీకా వృథా సమస్యగా మారుతోంది. అయితే కేరళ, బంగాల్ మాత్రం ఇందుకు భిన్నమైన బాటలో నడుస్తూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యాక్సిన్ డోసుల్లో ఒక్క చుక్క కూడా వృథాగా పోనివ్వకుండా కేటాయించిన దానికంటే ఎక్కువ మందికి టీకాలు అందిస్తున్నాయి.
మే నెలలో కేరళ తమకిచ్చిన కోటా కంటే అధికంగా 1.10లక్షల డోసులను ప్రజలకు వేసింది. బంగాల్ 1.61లక్షల డోసులను అధికంగా అందించింది. నిజానికి వ్యాక్సిన్ వయల్లో వృథాను పరిగణనలోకి తీసుకుంటే పది డోసులు ఉంటాయి. కేంద్రం లెక్క ప్రకారం 1.1శాతం ఇందులో కలిసి ఉంటుంది. అంటే సాధారణంగా ఒక వయల్ నుంచి 8 నుంచి 9 డోసులు ఇవ్వగలరు. అయితే కేరళ, బంగాల్ రాష్ట్రాలు మాత్రం ఈ వృథాను కూడా వినియోగించుకుంటున్నాయి. అలా ఒక వయల్ నుంచి పూర్తిగా 10 డోసులు ఇవ్వగలుగుతున్నాయి. అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది, నర్సులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. తద్వారా ఈ రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన కోటా కంటే ఎక్కువ డోసులను ప్రజలకు అందించగలుగుతున్నాయి. టీకా డోసుల వినియోగంలో కేరళ వైద్య సిబ్బంది పనితీరుపై ఇటీవల ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు.
ఆ రాష్ట్రంలో మూడో వంతు వృథా..