Jharkhand Petrol discount: ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేలా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కీలక ప్రకటన చేశారు. లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.25 మేర తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. కాకపోతే ఈ రాయితీ ద్విచక్రవాహనాలకు మాత్రమేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో జేఎంఎం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
"పెట్రోలు, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నందు వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల రాష్ట్ర స్థాయిలో ద్విచక్రవాహనాలకు లీటరు పెట్రోల్‌పై రూ.25 మేర తగ్గించి ఉపశమనం కల్పిస్తున్నాం. ఈ ప్రయోజనం జనవరి 26 నుంచి అమలులోకి రానుంది"
-- హేమంత్ సొరేన్, ఝార్ఖండ్ సీఎం
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి నెలకు 10 లీటర్ల పెట్రోల్‌పై ఈ రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.