ఝార్ఖండ్‌లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. నోరు కుట్టి.. కాళ్లు, చేతులు కట్టేసి.. ఓ వ్యక్తిని రైల్వే ట్రాక్‌పై పడేసిన విషాద సంఘటన పలాము జిల్లాలో జరిగింది.
అసలేమైంది..?
జిల్లాలోని భీతిహార్వాకు చెందిన భోలారామ్కు రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్యకు ఆరుగురు పిల్లలుండగా.. రెండో భార్యకు ఓ కొడుకు ఉన్నాడు. భోలారామ్ చెప్పులు కుడుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
రెండో భార్య కారణంగా ఆ కుటుంబంలో ఆస్తి వివాదం తలెత్తింది. ఈ విషయమై పలుమార్లు పంచాయితీ కూడా జరిగింది. అయితే వాటితో సంతృప్తి చెందని రెండో భార్య కుమారుడే ఈ ఘోరానికి ఒడిగట్టాడని భోలారామ్ చెప్పాడు. మంగళవారం రాత్రి రైల్వే ట్రాక్‌పై పడేశాడని తెలిపాడు. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో రైలు రాకపోవడం వల్ల ప్రాణాలతో బయటపడినట్లు వివరించాడు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఘటనా స్థలానికి చేరుకుని భోలారామ్ నోటి కుట్లు కత్తిరించారు. ఈ వివాదానికి సంబంధించి రెండు వర్గాలు.. ఉంటారి రోడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వారి మధ్య పోలీసులు రాజీ కుదిర్చారని తెలిసింది.
ప్రస్తుతం బాధితుడి ఫొటో సామాజిక మాధ్యమామల్లో వైరల్ అవుతోంది. అందులో అతని నోరు కుట్టినట్లు కనిపిస్తోంది.
ఇదీ చూడండి:Viral Video: కలెక్టర్ ఇంట్లో ఎలుగుబంటి హల్చల్