ఝార్ఖండ్ సిందరీ భాజపా ఎమ్మెల్యే ఇంద్రజీత్ మహతో ఇంట విషాదం నెలకొంది. ఓ వైపు ఎమ్మెల్యే అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా.. ఆయన కుమారుడు వివేక్ కుమార్ మహతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దిల్లీ ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వివేక్.. కొద్ది రోజుల కిందటే రాంచీ సమీపంలోని సిల్లీలో ఉన్న స్నేహితుడి దగ్గరికి వచ్చాడు.
వివేక్ కుమార్ మహతో ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే మురిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడం వల్ల రాంచీలోని మరో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వివేక్ డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా వివేక్ కుమార్ మహతో తండ్రి.. సిందరీ ఎమ్మెల్యే అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.