పళ్లు తోముకునేందుకు వేప పుల్ల విరిచే విషయమై చెలరేగిన ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని (Jharkhand Latest News) రాంచీలో జరిగింది.
ఇదీ జరిగింది..
పళ్లు తోముకునేందుకు వేప పుల్ల విరిచే విషయమై చెలరేగిన ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని (Jharkhand Latest News) రాంచీలో జరిగింది.
ఇదీ జరిగింది..
తమాడ్ ప్రాంతంలో వేప పుల్ల విషయమై నిందితుడు తరుణ్ మహతో, బాధితుడు హరధన్ లోహ్రా మధ్య శుక్రవారం ఉదయం వివాదం చెలరేగింది. కోపోద్రిక్తుడైన మహతో.. కత్తితో లోహ్రాపై దాడి చేశాడు (Jharkhand Crime News). అనంతరం లోహ్రాను ఆస్పత్రిని తరలించగా, అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోహ్రా మెడపై దాడి చేసినట్లు మహతో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. లోహ్రా, మహతో ఇద్దరిదీ పితాయి గ్రామమే.