ఇంట్లో గొడవ జరగడం వల్ల మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి నాటుబాంబును కొరికి ఆత్మహత్య చేసుకున్నాడు. గిరిదిహ్ జిల్లా హరిజన్తోలా గ్రామానికి చెందిన విక్కీ తురి అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన అత్తగారి ఇంట్లో భార్యతో జరిగిన వాగ్వాదమే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
గురువారం ఉదయం సమీప గ్రామంలోని అత్తగారింట్లో ఉన్న భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు విక్కీ వెళ్లాడు. కొన్నాళ్లుగా అక్కడే ఉంటున్న ఆమెను ఇంటికి రావాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలో గొడవ జరిగ్గా.. సాయంత్రం ఇంటికి తిరగొచ్చాడు. అయితే మనస్థాపంతోనే విక్కీ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అడవి పందులను చంపడానికి ఉపయోగించే నాటు బాంబును కొరికి విక్కీ ఆత్మహత్యకు పాల్పడినట్లు.. స్థానికులు తెలిపారు.
ఇవీ చదవండి:బంగాల్లో బాంబు పేలుడు- ఆరుగురికి గాయాలు