ఇక్కడ కనిపిస్తున్న గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఊర్లో నివసించేవారి వల్లే ఆ ప్రత్యేకత వచ్చింది. వాళ్లే అల్లుళ్లు. వివాహం చేసుకున్న తర్వాత అత్తామామల స్వస్థలంలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నవాళ్లే వీరంతా. వారి పేరుమీదుగానే ఈ ఊరికి జమైపడా అనే పేరొచ్చింది. ఝార్ఘండ్‌లోని సరైఖేలా జిల్లాలో ఈ గ్రామం ఉంది. ఆసంగి, బర్‌గిడీ గ్రామాల మధ్యలో నెలకొన్న జమైపడా పారిశ్రామిక ప్రాంతానికి దగ్గర్లో ఉంటుంది.
"ఈ ఊరిపేరు జమైపడా. ఉద్యోగాలు, ఉపాధి కోసం చాలామంది ఇక్కడే స్థిరపడ్డారు."
- గౌరంగో ప్రధాన్, అల్లుడు, జమైపడా
"ఆసంగీ, బర్‌గిఢీ గ్రామాలకు మధ్యలో జమైపడా ఉంటుంది. ఇక్కడ ఉండేవారిలో ఎక్కువ శాతం అల్లుళ్లే."
- చింతామణి ప్రధాన్, మామ, జమైపడా
1967లో ఈ ప్రాంతంలో తీవ్ర కరవు వచ్చినట్లు చెప్తారు. ఆ సమయంలో తమ భూములను ఇంటి అల్లుడికి దానంగా ఇస్తే వర్షాలు కురుస్తాయని, మంచి జరుగుతుందని ఓ పండితుడు చెప్పడం వల్ల గ్రామస్థులంతా అలాగే చేస్తారు. 30 ఏళ్ల క్రితం ఇక్కడ పెద్దఎత్తున పరిశ్రమలు వెలిశాయి. అప్పటినుంచీ, ఉద్యోగావకాశాల కోసం పెళ్లి తర్వాత అల్లుళ్లందరూ జమైపడాలోనే స్థిరపడిపోయారు.
"నా భర్త సొంతూరు చక్రధర్‌పూర్. అక్కడ మాకంటూ ఏమీ లేదు. పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నాం."