తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైల్లో ఖైదీ హత్య, 15 మందికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు

Jharkhand Jail Murder ఝార్ఖండ్‌లోని జంశెద్​పుర్​లో ఓ ఖైదీ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 15 మందికి మరణదండన విధించింది.

Jharkhand Jail Murder 15 people sentenced to death by Jharkhand court for killing jail inmate
Jharkhand Jail Murder 15 people sentenced to death by Jharkhand court for killing jail inmate

By

Published : Aug 19, 2022, 7:29 AM IST

Jharkhand Jail Murder: ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్‌లో ఓ ఖైదీ హత్య కేసుకు సంబంధించి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 15 మందికి ఉరిశిక్ష విధించింది. మరో ఏడుగురికి పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఇక్కడి ఘాఘీడీహ్‌ సెంట్రల్‌ జైలులో 2019లో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ఖైదీలు తీవ్రగాయాల పాలయ్యారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మనోజ్‌కుమార్‌ సింగ్‌ అనే ఖైదీ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈస్ట్‌ సింగ్భుమ్‌లోని అదనపు జిల్లా కోర్టు జడ్జి రాజేంద్ర కుమార్‌ సిన్హా గురువారం తీర్పు ఇచ్చారు.

ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 120బి (నేరపూరిత కుట్ర) కింద 15మందికి ఉరిశిక్ష విధించారని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. సెక్షన్‌ 307(హత్యాయత్నం) అభియోగాల కింద మరో ఏడుగురికి పదేళ్ల పాటు జైలు శిక్షను విధించారు. అయితే, మరణశిక్ష పడిన వారిలో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న ఇద్దరు ఖైదీలను పట్టుకొని తమ ఎదుట హాజరు పరచాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. ఆ దోషుల్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు.
2019 జూన్‌ 25న సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో మనోజ్‌ కుమార్‌ సింగ్‌తో పాటు ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మనోజ్‌ కుమార్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హింసాత్మక ఘటనపై పర్సుదిహ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనిపై గురువారం విచారించిన న్యాయస్థానం నిందితులకు శిక్షలు ఖరారు చేసింది.

ABOUT THE AUTHOR

...view details