ఝార్ఖండ్లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై ఓ కీచక ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై విషమిచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. సదరు బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పలాము జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
బాలిక కుటుంబానికి, నిందితుడికి మధ్య భూవివాదం ఉందని పోలీసులు తెలిపారు. పంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. అనంతరం ఆమెపై విషప్రయోగం చేసినట్లు తెలిపారు.