తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపాకీతో బెదిరించి.. బాలికపై గ్యాంగ్​రేప్​ - అత్యాచారం కేసులు

దేశంలో రోజురోజుకు బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఓ బాలికను తుపాకీతో బెదిరించి అపహరించి.. ముగ్గురు కిరాతుకులు సామూహిక అత్యాచారం చేశారు. మహారాష్ట్రలో మరో బాలికపై కొందరు దుండగులు సామూహికంగా లైంగికదాడి చేశారు. కాగా ఝార్ఖండ్​లో 10 ఏళ్ల బాలికపై మారుతండ్రే(స్టెప్​ఫాదర్)​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

rapes in India
దేశంలో పలుచోట్ల బాలికలపై అత్యాచారం

By

Published : Sep 23, 2021, 12:26 PM IST

ఉత్తర్​ప్రదేశ్​,ఝార్ఖండ్​, మహారాష్ట్రల్లో అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ముజఫర్​నగర్​ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు కిరాతుకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

తుపాకీతో బెదిరించి..

చెత్త పారవేయడానికి బయటకు వెళ్లిన బాలికను తపాకీతో బెదిరించిన ముగ్గురు వ్యక్తులు.. అడవిలోకి ఎత్తుకెళ్లారు. అనంతరం అత్యాచారం చేసి అక్కడే విడిపెట్టారు. బయటకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు గాలించారు. చివరికి బాధితురాలి జాడ తెలుసుకుని రక్షించారు.

నిందితులను మందలించడానికి ప్రయత్నించినప్పుడు.. బాధితురాలి కుటుంబసభ్యులపై వారు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రాజీవ్​, గుద్దు, అషులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని.. వారి కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నారు.

తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి..

ఝార్ఖండ్​ జంశెద్​పుర్​లో పదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. మారు తండ్రే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి తల్లి, మారుతండ్రి మధ్య తరచు గొడవలు జరిగేవి. ఈ విషయమై బాలిక తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెతో పాటు వెళ్లిన బాధితురాలు జరిగిన అఘాయిత్యం గురించి అధికారులకు చెప్పింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిందితుడు బెదిరించాడని ఆ బాలిక తెలిపింది. దీంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు కోసం గాలిస్తున్నారు.

మహారాష్ట్రలో సామూహిక హత్యాచారం

మహారాష్ట్ర ఠాణె జిల్లాలో 15 ఏళ్ల బాలికపై బుధవారం రాత్రి కొందరు దుండగులు సామూహిక హత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎంత మంది చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది​ హతం

ABOUT THE AUTHOR

...view details