జామపండ్లను తినాలని ఆశపడ్డ ఓ బాలుడి పరిస్థితి ప్రాణాపాయంగా మారింది. చెట్టుపై నుంచి కిందపడగా... ఇనుప కడ్డీలు అతడి శరీరంలో గుచ్చుకున్నాయి. ఈ ఘటన ఝార్ఖండ్ ధన్బాద్లో(Jharkhand Dhanbad News) జరిగింది.
ధన్బాద్ జిల్లాలోని(Jharkhand Dhanbad News) ఆసన్బానీ గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు.. శుక్రవారం తన ఇంటి సమీపంలోని ఓ జామ చెట్టు ఎక్కాడు. అయితే.. అనుకోకుండా కాలు జారి కింద ఉన్న ఇనుప కడ్డీలపై పడ్డాడు. దాంతో మూడు ఇనుప కడ్డీలు అతడి శరీరంలోకి గుచ్చుకున్నాయి. స్థానికులు వాటిని కత్తిరించి, ధన్బాద్లోని ఎస్ఎన్ఎంసీఎహెచ్ ఆస్పత్రికి బాలుడిని తరలించారు. అక్కడ బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే.. బాధిత బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.