తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో రైల్వే స్టేషన్​ పేరు మార్చిన యూపీ.. ఝాన్సీ రాణి పేరుతో.. - Jhansi railway station new name

Jhansi railway station new name: ఇప్పటికే రెండు రైల్వే స్టేషన్ల పేర్లు మార్చిన ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం.. తాజాగా మరో స్టేషన్​ మారును మార్చుతున్నట్లు స్పష్టం చేసింది. ఝాన్సీ రైల్వే స్టేషన్​ను... వీరాంగణ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్​గా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

Jhansi Railway Station
ఝాన్సీ రైల్వే స్టేషన్

By

Published : Dec 30, 2021, 1:21 PM IST

Jhansi railway station new name: ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం కొద్ది రోజులుగా ప్రముఖ ప్రాంతాలు, రైల్వే స్టేషన్ల పేర్లు మార్చుతోంది. తాజాగా మరో రైల్వే స్టేషన్​ పేరును మార్చేసింది యోగి ఆదిత్యనాథ్​ సర్కార్​. రాణి లక్ష్మీబాయి స్మారకార్థం.. ఝాన్సీ రైల్వే స్టేషన్​ను వీరాంగణ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్​గా మార్చింది. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు ముఖ్యమంత్రి యోగి.

పేరు మార్చుతున్నట్లు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. " 2021, నవంబర్​ 24న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎలాంటి అభ్యంతరం లేదని లేఖ రాసిన క్రమంలో స్టేషన్​ పేరును మార్చుతున్నాం." అని పేర్కొంది. ఈ క్రమంలో మార్పులు చేసేందుకు ప్రక్రియ మొదలు పెట్టినట్లు చెప్పారు నార్త్​ సెంట్రల్​ రైల్వే చీఫ్​ పీఆర్​ఓ శివమ్​ శర్మ.

ఝాన్సీ రైల్వే స్టేషన్​ నామఫలకం
ఝాన్సీ రైల్వే స్టేషన్​
స్టేషన్​ ముందు రాణి లక్ష్మీబాయి విగ్రహం

గతంలో రెండు..

యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేర్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంతకు ముందు ముఖల్​సరాయ్​ రైల్వే స్టేషన్​ పేరును దీన్​ దయాల్​ ఉపాధ్యాయ జంక్షన్​గా, ఫైజబాద్​ రైల్వే స్టేషన్​ పేరును అయోధ్య జంక్షన్​గా మార్చింది. అలాగే.. ఫైజబాద్​, అలహాబాద్​ జిల్లాల పేర్లను అయోధ్య, ప్రయాగ్​రాజ్​లుగా మార్చేసింది.

ఇదీ చూడండి:

Habibganj station: ఆ రైల్వే స్టేషన్​కు రాణీ కమలాపతి పేరు

అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు

ABOUT THE AUTHOR

...view details