తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యుత్​ శాఖ నిర్లక్ష్యం- యువకుడు ఆత్మహత్య!

19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. విద్యుత్​ శాఖ నిర్లక్ష్యమే వ్యక్తి మరణానికి కారణమని.. మృతుడి సోదరి ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో జరిగిందీ ఘటన.

19-yr-old orphan hangs self to death
19-yr-old orphan hangs self to death

By

Published : Apr 13, 2022, 5:13 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో 19 ఏళ్ల ఓ యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం.. అతడి సోదరీమణులకు అప్పగించారు. వారే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. తన సోదరుడి మరణానికి విద్యుత్​ శాఖనే కారణమని మృతుడి సోదరి రోషిణి ఆరోపించారు. తమకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి.. ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు.

సోదరుడికి అంత్యక్రియలు నిర్వహించిన రోషిణీ

ఇదీ జరిగింది:పవర్​హౌస్​ కాలనీకి చెందిన షానీ.. తన ఇద్దరు సోదరీమణులతో కలిసి ఉంటున్నాడు. ఉత్తర్​ప్రదేశ్​ విద్యుత్​ శాఖలో పనిచేసే వీరి తండ్రి భరత్​ బహదూర్​ ఆరేళ్ల క్రితం చనిపోయాడు. కొద్దిరోజులకే తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. అనాథల కష్టాలు చూసి.. అండగా ఉంటామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యుత్​ శాఖ భరోసా ఇచ్చింది. అయితే.. వారు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే ఆర్థిక కష్టాలు ఎక్కువై.. తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని రోషిణి చెప్పారు. సకాలంలో తమలో ఎవరికైనా ఉద్యోగం ఇచ్చి ఉంటే, షానీ ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details