తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కళ్లలో కారం చల్లి 800 గ్రాముల బంగారం చోరీ - కేరళ నగల వ్యాపారిపై దాడి

కేరళలో ఓ నగల వ్యాపారి కళ్లలో కారం చల్లి దాదాపు 800 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Jeweller attacked in Thiruvananthapuram; 100 sovereign gold stolen
కళ్లలో కారం చల్లి 800 గ్రాముల బంగారం చోరీ

By

Published : Apr 10, 2021, 10:02 AM IST

కేరళ తిరువనంతపురంలో ఓ నగల వ్యాపారి కళ్లలో కారం చల్లి దాదాపు 800 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. వ్యాపారి కారును ముందూ.. వెనకా వెంబడించిన దొంగల ముఠా.. పళ్లిపురంలోని టెక్నో పార్కు వద్దకు రాగానే అడ్డగించారు. కారు అద్దం పగులగొట్టి వ్యాపారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్లలో కారం చల్లి.. బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు.

కారు అద్దాలు పగలగొట్టి..
దుండగులు ధ్వంసం చేసిన కారు

ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిందన్నారు.

ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న పోలీసులు

''వ్యాపారి స్వస్థలం మహారాష్ట్ర. బంగారం విలువ సుమారు రూ. 40 లక్షలు ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం.''

- పోలీసులు

ఇదీ చదవండి :కంబళ శ్రీనివాస ప్రతిభకు ప్రపంచం సలాం!

ABOUT THE AUTHOR

...view details