తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన జీప్​.. నలుగురు మహిళలు సహా ఆరుగురు కూలీలు మృతి - విహారయాత్రలో విషాదం

గుజరాత్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన ఓ జీపు ఢీకొట్టగా బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.

jeep and truck accident
jeep and truck accident

By

Published : Feb 15, 2023, 5:15 PM IST

Updated : Feb 15, 2023, 6:45 PM IST

గుజరాత్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును ఓ జీపు ఢీకొట్టగా నలుగురు మహిళలు సహా ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం పటాన్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన ఓ జీపు ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రక్కులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. జీపు టైరు ఒక్కసారిగా పేలిపోవడం వల్ల అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజస్థాన్ నుంచి 15 మంది కూలీలతో ఓ జీపు రాధన్​పుర్​లోని వారాహి జాతీయ రహదారిపై వెళ్తోంది. అదే సమయంలో జీపు టైరు ఒక్కసారిగా పేలిపోవడం వల్ల వాహనం అదుపుతప్పి.. రహదారి పక్కనే ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో జీపులో ఉన్న నలుగురు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైవేపై ఈ ప్రమాదం జరగడం వల్ల ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. మృతులు సంజుభాయ్ ఫుల్‌వాడి(50), దుదాభాయ్ రాఠోడ్(50), రాధాబెన్ పర్మార్(35), కాజల్ పర్మార్(59), అమృతా వంజారా(15), పినల్‌బెన్ వంజారా(7)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్​పీ కేకే పాండ్య వెల్లడించారు.

విహారయాత్రలో విషాదం.. నలుగురు విద్యార్థినిలు మృతి
తమిళనాడులోని కరూర్‌ జిల్లా మయనుర్‌లో విషాదం నెలకొంది. విహార యాత్రకు వెళ్లిన నలుగురు విద్యార్థినులు కావేరి నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా పుదుకోట్టై జిల్లాలోని విరాలిమలైలో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. నదిలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. బాలికల మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Feb 15, 2023, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details