తెలంగాణ

telangana

ETV Bharat / bharat

JEE Mains 2021: మెయిన్స్​ ఫలితాలు నేడే.. అడ్వాన్స్​డ్ రిజిస్ట్రేషన్లు కూడా... - జేఈఈ మెయిన్ ఫలితాలు

జేఈఈ మెయిన్స్ ఫలితాలు (JEE MAIN RESULTS) నేడు విడుదల కానున్నాయి. దీంతో పాటు జేఈఈ అడ్వాన్స్​డ్ రిజిస్ట్రేషన్ సైతం ఈ రోజు ప్రారంభం కానుంది.

JEE MAINS RESULTS
జేఈఈ మెయిన్ ఫలితాలు

By

Published : Sep 13, 2021, 1:44 PM IST

Updated : Sep 13, 2021, 1:55 PM IST

జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు (JEE MAIN RESULTS) నేడు (సోమవారం) వెల్లడికానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) అధికారిక వెబ్​సైట్​లో నుంచి స్కోర్​కార్డ్ (JEE score card), ర్యాంక్​ లిస్ట్ డౌన్​లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు జేఈఈ అడ్వాన్స్​డ్, ఐఐటీ ఎంట్రెన్స్ రిజిస్ట్రేషన్ల (JEE advanced registration) ప్రక్రియ సైతం నేడు ప్రారంభం కానుంది.

పరీక్ష వాయిదా పడటం సహా.. జేఈఈ స్కామ్​కు సంబంధించి సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఫలితాలు (JEE main result 2021) ఆలస్యమవుతున్నాయి.

అడ్వాన్స్​డ్​కు 2.5 లక్షల మంది

మెయిన్స్ పరీక్షను వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించినందున.. స్కోర్ల శాతం ఆధారంగా ఫలితాలను నార్మలైజేషన్ (JEE mains normalisation score) చేయనుంది. మెయిన్స్​లో అర్హత సాధించిన 2.5 లక్షల అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్​డ్​కు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

దేశంలోని 23 ఐఐటీలలో ఇంజినీరింగ్, సైన్స్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సులలో చేరేందుకు (IIT admission) జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ఇదీ చదవండి:

Last Updated : Sep 13, 2021, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details