కరోనా కారణంగా వాయిదా పడిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని ప్రకటించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఈ ఏడాది అక్టోబర్ 3న పరీక్షను నిర్వహించనున్నట్లు సోమవారం వెల్లడించారు.
"జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్ష 2021 అక్టోబర్ 3న నిర్వహిస్తాం. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష జరగనుంది" అని ప్రధాన్ ట్వీట్ చేశారు.