JEE Advanced Exam HI Tech Copy In Hyderabad : ఓ కార్పోరేట్ కళాశాలలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించారు. ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి మార్కులు సాధించాలని కలలు కన్నారు. దీనికోసం అడ్డదారిని ఎంచుకున్నారు. ఎస్సెస్సీతో పాటు, ఇంటర్‌లోనూ ఎక్కువ మార్కులు సాధించడంతో పాటు, జేఈఈ మెయిన్స్‌లోనూ ప్రతిభ కనబర్చిన విద్యార్థి సాయం తీసుకోవాలని ప్రణాళిక రచించారు. స్నేహితులు అడగడంతో సదరు విద్యార్థి కూడా అంగీకరించాడు. ఐదుగురు ఇంటర్ విద్యార్థులు కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. తమకు వచ్చిన సమాధానాలను ఒకరికొకరు చేరవేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
JEE Advanced Exam Mass Copying In Hyderabad : జేఈఈ అడ్వాన్స్‌డ్ మాస్ కాపీయింగ్.. ఎలా జరిగిందంటే..
17:49 June 06
JEE Advanced Exam Mass Copying : జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రశ్నాపత్రాలు.. వాట్సాప్ గ్రూప్‌లో ప్రత్యక్షం
ముందే ప్రణాళిక.. అనుసరించిన వ్యూహం : దీనికోసం మొబైల్స్‌ను పరీక్షా కేంద్రంలోకి ఎలా తీసుకెళ్లాలనే ప్రణాళికను ముందే సిద్ధం చేసుకున్నారు. హాల్లోకి వెళ్లే సమయంలో తనిఖీ ఉంటుంది కాబట్టి ముందే ఫోన్లను లోపలికి తీసుకెళ్లేలా ఆలోచించారు. అందరు విద్యార్థులకంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రం ఆవరణలో మొబైళ్లను ఉంచారు. పరీక్షా ప్రారంభమయ్యే కంటే అర్ధగంట ముందు సెంటర్లోకి చేరుకున్నారు. ఆ తర్వాత మొబైల్‌ను ఆవరణలో నుంచి తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా మూత్రశాలలో దాచారు. పరీక్ష ప్రారంభమయ్యే ముందే మూత్రశాలకు వెళ్లి మొబైల్ ను తమ వెంట తెచ్చుకున్నారు. ఆ తర్వాత సమాధానాలను ఒకరికొకరు చేరవేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్విజిలెటర్ కు దొరికిపోయారు.
Smart Copying in JEE Advanced Exam : నాచారంలోని అయాన్ డిజిటల్ సెంటర్ లో రెండు పరీక్షా కేంద్రాలున్నాయి. కూకట్ పల్లికి చెందిన అన్నదమ్ములు ఆ రెండు సెంటర్లలో పరీక్ష రాశారు. 4వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష జరిగింది. ఓ విద్యార్థి వద్ద మొబైల్ ఫోన్ ఉన్నట్లు ఇన్విజిలేటర్ ఉదయం 11గంటల సమయంలో గుర్తించారు. వెంటనే పరిశీలకుడికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విద్యార్థి ఫోన్ స్వాధీనం చేసుకొని పరిశీలించగా వాట్సాప్ గ్రూప్ ఉన్నట్లు తేలింది. అందులో ఐదుగురు విద్యార్థులున్నట్లు గుర్తించారు. విద్యార్థి సోదరుడు పక్కనే ఉన్న మరో సెంటర్లో పరీక్ష రాస్తున్నట్లు తేల్చిన పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకొని మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. సోదరులిద్దరూ ఇచ్చిన సమాచారం ప్రకారం మిగతా ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాస్తున్న సెంటర్ నిర్వాహకులను అప్రమత్తం చేశారు.
Hitech Copying in JEE Exam : సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ, మౌలాలీ, ఎల్బీనగర్లలో ఉన్న అయాన్ డిజిటల్ సెంటర్లలో పరీక్ష రాసిన ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని వాళ్ల మొబైల్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు. నాచారం పీఎస్‌లో సోదరులిద్దరిపైన, సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ లో ఓ విద్యార్ధిపై, ఎల్బీనగర్ ఓ విద్యార్థిపై, మల్కాజ్ గిరిలో మరో విద్యార్థిపై పోలీసులు చూచిరాత కింద కేసు నమోదు చేసి 41ఏ సీఆర్పీసీ నోటీసులిచ్చారు. 3 రోజుల్లో సమాధానాలివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐదుగురు విద్యార్థులపైనా చూచిరాత కింద కేసు నమోదు చేయడంతో వాళ్ల చదువు ప్రశ్నార్థకంగా మారింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు మార్కులు సంపాందించాలనే కోరికతో చూచిరాతకు పాల్పడి జేఈఈ కలను చెరిపేసుకున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి :