జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల తేదీని ప్రకటించింది కేంద్ర విద్యాశాఖ. జులై 3న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరపనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఐఐటీ ఖరగ్‌పుర్ ఈ పరీక్ష నిర్వహించనుంది.
జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష - జేఈఈ తాజా వార్తలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను జులై 3న నిర్వహించనుంది కేంద్ర విద్యాశాఖ. దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షల తేదీని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.
సాధారణంగా ఐఐటీల్లో సీటు సంపాదించాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఉత్తీర్ణులవడం సహా 12వ తరగతిలో 75 శాతం కన్నా ఎక్కువ మార్కులు సాధించాలి లేదా అర్హత పరీక్షల్లో మొదటి 20 శాతంలో నిలిచి ర్యాంక్ కొట్టాలి. అయితే 2021లో ఈ కటాఫ్‌ను తొలగిస్తున్నట్లు ఫోఖ్రియాల్ తెలిపారు.
జేఈఈ మెయిన్-2020లో అర్హత సాధించిన చాలా మంది కరోనా వల్ల అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయలేకపోయారు. వీరందరినీ 2021లో నిర్వహించే అడ్వాన్స్‌డ్ పరీక్షకు నేరుగా అనుమతించారు. తొలి విడత మెయిన్ పరీక్షలు ఫిబ్రవరి 23-26 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ నెల 16లోపు దరఖాస్తు చేయాలి.