ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు ఆలస్యం కారణంగా జేడీయూ భారీ మూల్యం చెల్లించుకుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఈ మేరకు పరోక్షంగా భాజపాపై శనివారం విమర్శలు గుప్పించారు. మిత్రులు ఎవరో తెలుసుకోవడంలో విఫలం అయ్యామని వ్యాఖ్యానించారు.
"ఎన్నికలకు ఐదు నెలల ముందే కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగి ఉండాల్సింది. ఆలస్యం కారణంగా మా పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. సీఎం పదవిపై నాకు ఆశ లేకపోయినా సొంత పార్టీ, భాజపాల నుంచి ఒత్తిడి రావడం వల్ల బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది."
-నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి