తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత స్మారక చిహ్నం.. మెరీనా బీచ్లో ఆవిష్కృతమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళని స్వామి.. బుధవారం ఈ స్మారకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పనీర్ సెల్వం, తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం వారు జయలలిత చిత్రపటానికి నివాళులు అర్పించారు.
'అమ్మ' స్మారకాన్ని ఆవిష్కరించిన పళనిస్వామి
తమిళనాడు మెరీనా బీచ్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత స్మారక చిహ్నాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆవిష్కరించారు. అనంతరం ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.
'అమ్మ' స్మారకాన్ని ఆవిష్కరించిన తమిళనాడు సీఎం
ఈ స్మారక నిర్మాణానికి మూడేళ్ల క్రితం.. ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పనీర్ సెల్వం శంకుస్థాపన చేశారు. హంసాకృతిలో దీన్ని నిర్మించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు కేటాయించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ స్మారకం పక్కనే.. జయలలిత స్మారకాన్ని ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:జైలు నుంచి శశికళ విడుదల- ఇంకా ఆస్పత్రిలోనే.
Last Updated : Jan 27, 2021, 2:04 PM IST