Jaya Bachchan in Rajya Sabha: మాదక ద్రవ్యాల రవాణా, ఆర్థిక సాయం చేసే నేరస్ధులను శిక్షించేందుకు ఉద్దేశించిన నార్కోటిక్స్, సైకో-ట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ సవరణ బిల్లు-2021కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును ప్రవేశపెట్టగా, రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఎంపీ జయా బచ్చన్.. రాజ్యసభలో అధికార భాజపాపై మండిపడ్డారు. భాజపా త్వరలోనే గడ్డు రోజులను ఎదుర్కొంటుందని తాను శపిస్తున్నాని చెప్పారు. నిజాయితీగా వ్యవహరించాలని రాజ్యసభ ఛైర్మన్‌కు ఆమె సూచించారు. ప్రతిపక్షాల గొంతును అణచివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
అసలేమైందంటే..?
Jaya bachhan personal comments: బిల్లుపై చర్చ సమయంలో జయ మాట్లాడుతూ.. 12 మంది నేతలపై సస్పెన్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధికార భాజపా సభ్యుడు ఒకరు ఆమెపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా.. ఒకప్పుడు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన చేసే వారని వ్యాఖ్యానించారు. దీనిపై భాజపా సభ్యులు మండిపడ్డారు.