తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Jawad Cyclone: బలహీనపడుతున్న జవాద్.. ఒడిశాకు తప్పిన ముప్పు!

Jawad cyclone: జవాద్ తుపాను బలహీనపడుతోంది. శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి.. ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుందని వాతావరణశాఖ వెల్లడించింది.

jawad cyclone
జవాద్

By

Published : Dec 5, 2021, 6:45 AM IST

Jawad cyclone: ఒడిశాకు జవాద్‌ తుపాను ముప్పు తప్పింది. శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. అప్పటికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది.

బలహీన పడుతున్న జవాద్

ఈ నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించే ప్రక్రియను నెమ్మదింపజేసింది. 300 మంది గర్భిణీలు సహా 1500 మందిని మాత్రమే సంరక్షణ కేంద్రాలకు తరలించింది.

తుపాను బలహీనపడినా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాలపూర్‌ ఐఎండీ అధికారి ఉమాశంకర్‌దాస్‌ తెలిపారు. తుపాను ప్రభావం అంచనా కన్నా తక్కువగానే ఉందని ఎన్​డీఆర్​ఎఫ్​ డైరెక్టర్​ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. అది మరింత బలహీనపడుతోందని చెప్పారు.

తుపాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంరక్షణ గృహాల్లో కొందరు ఆశ్రయం పొందారు.

సంరక్షణ కేంద్రంలో..

ఇదీ చూడండి:కదిలే రైలు ఎక్కుతూ కింద పడిన మహిళ.. లక్కీగా క్షణాల్లోనే...

ABOUT THE AUTHOR

...view details