బంగాల్ సీఎం మమతా బెనర్జీని కవి, గేయ రచయిత జావెద్ అక్తర్, నటి షబానా అజ్మీ దిల్లీలో కలిశారు. ప్రస్తుతం దేశంలో మార్పు అవసరమని జావెద్ అక్తర్ అన్నారు. ఉద్యమాల పురిటి గడ్డ బంగాల్ అని అభిప్రాయపడ్డారు. 'దేశంలో ఎన్నో ఆందోళనలు జరుగుతున్నాయి. హింస పెరిగిపోతోంది. దిల్లీ లాంటి ప్రదేశాల్లోనూ మత విద్వేషాలు జరుగుతుండడం సిగ్గుచేటు. బంగాల్లో కవులు, కళాకారులు దీదీకి మద్దతిస్తారు'అని అన్నారు.
థర్డ్ ఫ్రంట్‌కు మమత నాయకత్వం వహిస్తారా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'నాయకత్వం ఎవరనేదానికి దీదీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వరు. ఆమె మార్పు కోరుకునే తత్వం గలవారు. గతంలో బంగాల్ కోసం పోరాడారు. ఇప్పుడు దేశం కోసం పోరాడుతున్నారు. దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది ముఖ్యం కాదు, హిందుస్థాన్ ఎలా ఉన్నది అనేది మాత్రమే ప్రధానమైన అంశం.'అని చెప్పుకొచ్చారు.