తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైకిల్‌పై భార్య శవం.. దిక్కుతోచని స్థితిలో భర్త

కరోనాతో మృతి చెందిన భార్య అంత్యక్రియలకు గ్రామస్థులు అనుమతించకపోవటంతో దిక్కు తోచని స్థితిలో ఓ వృద్ధుడు మృతదేహాన్ని సైకిల్​పై తీసుకెళ్తున్న ఫోటోలు వైరల్​గా మారాయి. ఉత్తర్​ప్రదేశ్​ జౌన్​పుర్​ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒడిశా బొలాన్​గిర్​ జిల్లాలోనూ ఓ కొడుకు తండ్రి మృతదేహాన్ని సైకిల్​పై తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో ఖననం చేశాడు.

Dead body on bicycle
సైకిల్‌పై భార్య మృతదేహం

By

Published : Apr 28, 2021, 8:18 PM IST

దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ కొన్ని దృశ్యాలు మనసుల్ని మెలిపెట్టేస్తున్నాయి. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు చేయొద్దంటూ గ్రామస్థులు ఖరాకండిగా చెప్పిన వేళ దిక్కు తోచని స్థితిలో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్డు పక్కన కూర్చున్న కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రం జౌన్‌పుర్‌ జిల్లాలోని అంబర్‌పుర్‌కు చెందిన మహిళ రాజ్‌కుమారి (50) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సోమవారం భర్త ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే రాజ్‌కుమారి మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొచ్చి వారింటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆమెకు కొవిడ్‌ సోకినట్లు కూడా వైద్యులు వెల్లడించలేదు.

రోడ్డు పక్కన రోధిస్తున్న వృద్ధుడు

అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు వృద్ధుడికి గ్రామస్థులు సాయం చేయాల్సింది పోయి.. ఎవరూ ఆ చుట్టుపక్కలకు కూడా రాలేదు. గ్రామంలోని శ్మశానవాటికలో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకూడదని తెగేసి చెప్పేశారు. ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియక ఆ వృద్ధుడు సైకిల్‌ మధ్యలో భార్య మృతదేహాన్ని ఉంచి గంటల కొద్దీ తిరిగాడు. దిక్కు తోచని స్థితిలో రోడ్డు పక్కన ఆగి గుండెలవిసేలా రోధించాడు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో స్థానిక అధికారులపై నెటిజన్లు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న జౌన్‌పుర్‌ పోలీసులు రాజ్‌కుమారి మృతదేహానికి రామ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

సైకిల్​పై భార్య మృతదేహాన్ని తీసుకెళుతున్న వృద్ధుడు

మరో ఘటన...

ఒడిశా బొలాన్​గిర్​ జిల్లా భలుదుంగురి గ్రామంలో ఇలాంటి సంఘటనే జరిగింది. తండ్రి మరణించగా.. అంత్యక్రియలకు ఎవరూ రాకపోవటం వల్ల మృతదేహాన్ని సైకిల్​పైనే తీసుకెళ్లాడు కొడుకు. ఖప్రఖోల్​ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్​-19కు చికిత్స పొందుతూ అయోధ్య సాహూ అనే వ్యక్తి మరణించాడు. వైరస్​ భయంతో బంధువులు, గ్రామస్థులు ఎవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో చేసేది ఏమీ లేక.. మృతదేహాన్ని పాలిథీన్​ కవర్లలో పెట్టి రెండు కిలోమీటర్లు సైకిల్​ తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో ఖననం చేశాడు.

తండ్రి మృతదేహాన్ని సైకిల్​పై తీసుకెళుతున్న కుమారుడు

ఇదీ చూడండి:3వేల మంది కొవిడ్‌ బాధితులు ‘మిస్సింగ్‌’

ABOUT THE AUTHOR

...view details