తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో 21 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం

దిల్లీలో ఈ ఏడాది జనవరిలో ఇప్పటి వరకు 56.6 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైందని, అది గత 21 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతమని వాతావరణ శాఖ తెలిపింది. వరుసగా నాలుగోరోజూ దిల్లీలో వర్షం కురుస్తోంది.

January rain in Delhi
దిల్లీలో 21 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం

By

Published : Jan 7, 2021, 6:09 AM IST

దేశ రాజధాని దిల్లీలో ఈ ఏడాది జనవరిలో ఇప్పటికే 56.6 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది 21 ఏళ్లలోనే అత్యధికమని పేర్కొంది. అకాల వర్షాలతో దిల్లీ నగరం తడిసిముద్దవుతోంది. వరుసగా నాలుగోరోజూ వానజల్లు కురుస్తుండటం నగరవాసులను ఇబ్బందులకు గురి చేస్తోంది.

దిల్లీలో ప్రతి ఏటా జనవరిలో సగటున 21.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అయితే.. గత ఏడాది 48.1 ఎంఎం, 2019లో 54.1 ఎంఎం, 1999లో అత్యధికంగా 59.7 ఎంఎం వర్షపాతం నమోదైంది. అలాగే.. 1995లో గరిష్ఠంగా 69.8 శాతం మేర వర్షం కురిసింది.

బుధవారం సఫ్దార్​గంజ్​లో 6 ఎంఎం వర్షపాతం నమోదవగా.. వాతావరణ కేంద్రాలైన పలమ్​ (5.4), లోధిరోడ్​ (6.3), రిడ్జ్​ ( 11.1), అయానగర్​ (3.6) శాతం మేర వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది.

ఇదీ చూడండి:యూఎస్​ క్యాపిటల్​ వద్ద ఉద్రిక్తత.. ట్రంప్​ శాంతి మంత్రం

ABOUT THE AUTHOR

...view details