Pawan Kalyan Meet With Kapu Leaders: గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య భేటీ అయ్యారు. సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత ఉండదని పవన్ వెల్లడించారు. కులం నుంచి తను ఎప్పుడూ పారిపోలేదన్న పవన్... సంఖ్యాబలం ఉన్నా కాపులు అధికారానికి దూరంగానే ఉన్నారని గుర్తు చేశారు. కాపులు అధికారంలోకి వస్తే మిగతావారిని తొక్కేస్తారన్న విషప్రచారం జరుగుతుందని... దీనిని కాపు శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని విడగొట్టేవారే ఎక్కువని కలిపేవారు తక్కువని పవన్ అభిప్రాయపడ్డారు. అధికారం అనేది ఏ ఒక్కరి సొంతం కాదన్న పవన్ కల్యాణ్. కుళ్లు, కుతంత్రాలు లేని రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు.
రామ్‌మనోహర్ లోహియా కలలు సాకారం చేసేందుకు జనసేన కృషి చేస్తుందని పవన్ వెల్లడించారు. ఉపాధి, ఉద్యోగాలు కావాలని అడిగే స్థితిలోనే ఇంకా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యంగా ఉంటే వేరేవాళ్లు అధికారంలోకి రావడం అసాధ్యమని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తాను ఏదైనా అంటే మనవారితోనే తిట్టిస్తారని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాజకీయ సాధికారత కావాలంటే కాపులంతా ఏకం కావాలని సూచించారు. నేనెప్పుడూ లోపాయకారీ ఒప్పందాలు పెట్టుకోనని.. కాపుల ఆత్మగౌరవాన్ని తనెప్పుడూ తగ్గించనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అజెండా కోసం పనిచేయడం లేదని... జనసేనను నమ్మినవారి ఆత్మగౌరవాన్ని మేం తగ్గించబోమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇతర పార్టీల అజెండా కోసం తాను పనిచేయబోనని కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీని ప్రతికూల పవనాల మధ్యే నడుపుతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఓటర్ల వైవిధ్యమైన తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందేనని పవన్ అభిప్రాయపడ్డారు. వేల కోట్లు ఉంటేనే రాజకీయాలు చేసే స్థాయికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంపై ఎంతో ఇష్టం ఉంది కనుకే ఓర్పుతో ఇంకా రాజకీయాల్లో ఉన్నానని వెల్లడించారు. ప్రతిచోటా సోషల్ ఇంజినీరింగ్ జరగాలని పవన్ కల్యాణ్ కోరారు. గత ప్రభుత్వంలో రిజర్వేషన్ గురించి మాట్లాడినవారు ఇప్పుడెందుకు మాట్లాడరని పవన్ నిలదీశారు. కుల ఆత్మగౌరవాన్ని చంపుకుని మరీ వైసీపీకి ఎందుకు ఓటేశారని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడారా? అంటూ పవన్ ప్రశ్నించారు. కాపులకు రాజకీయ సాధికారత కావాలంటే అందరూ ఏకం కావాలని కోరారు. కాపులంతా ఓట్లేస్తే గాజువాక, భీమవరంలో గెలిచేవాడినని పవన్ గుర్తు చేశారు. కాపులకు ఏదైనా మంచి జరిగితే అది తనే చేయగలనని పవన్ అభిప్రాయపడ్డారు. మిగతా కులాలతోను సామరస్య ధోరణితో మెలగాలని పవన్ కల్యాణ్ కాపులకు పిలుపునిచ్చారు.
చేగొండి హరిరామ జోగయ్య: మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో... కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేయడమే ఎజెండాగా సమావేశంలో నిర్ణయించారు. జగన్ పోవాలి... పవన్ రావాలి అనేది తమ అంతిమ లక్ష్యమని హరిరామ జోగయ్య చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు సంక్షేమ సేన నేతలతో నిర్వహించిన సమావేశం విజయవంతమైందని తెలిపారు.
కాపు సంక్షేమ సేన కార్యక్రమంలో పవన్‌కల్యాణ్ ఇవీ చదవండి: