Janasena on Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ పోరుకు సన్నద్ధం అవుతున్నాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్ధులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. టీడీపీ కూడా పోటీ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని జనసేన తెలిపింది.
Telangana Janasena Leaders Meet Pawan Kalyan: తెలంగాణలో ఎన్నికల తేదీలు ఖరారు అయినందున రాష్ట్ర జనసేన నాయకులు(Janasena Leaders), కార్యకర్తలు హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో భేటీ అయ్యారు. ఎన్నికల పోటీపై పార్టీ నేతల్లో సందిగ్ధత ఏర్పడంతో తమ అభిప్రాయాలను పవన్‌కు వివరించినట్లు రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. గత ఎన్నికలు జరిగినప్పుడు.. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని పోటీకి దూరంగా ఉన్నామని స్పష్టం చేసింది. పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందనే విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పింది.
JanaSena Contest in Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన.. ఈ స్థానాల్లో పోటీకి సిద్ధం