తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రంలో తొలిసారిగా జనసేన బరిలోకి- ఓటర్లను ఏ మేరకు ప్రసన్నం చేసుకోనుంది? - జనసేన బీజేపీ పొత్తు

Janasena Election Campaign in Telangana : తెలంగాణలో పుట్టి.. ఏపీలో ఎదుగుతున్న పార్టీ జనసేన. సినీనటుడు పవన్ కల్యాణ్‌ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సాఆర్​సీపీ ప్రభుత్వంపై తెలుగుదేశంతో కలిసి విస్తృత పోరాటాలు చేస్తోంది. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో ఉనికి చాటుకోవాలనుకుంటుంది. దశాబ్దికాలంగా రాష్ట్రంలో ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. ఎన్​డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన.. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకొని 8 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. తెలంగాణలో జనసేన వ్యూహం ఏంటీ ? జనసేనతో జట్టు కట్టడం వల్ల తెలంగాణలో బీజేపీకి జరిగే మేలేంటీ? ఓటర్లను జనసేన ఏ మేరకు ప్రసన్నం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Janasena Election Campaign in Telangana
Janasena Alliance with BJP

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 5:42 AM IST

రాష్ట్రంలో తొలిసారిగా జనసేన బరిలోకి- ఓటర్లను ఏ మేరకు ప్రసన్నం చేసుకోనుంది

Janasena Election Campaign in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో ప్రధాన పార్టీలతో పాటు తొలిసారిగా జనసేన బరిలోకి దిగింది. భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూకట్‌పల్లి- ప్రేమ్‌కుమార్‌, తాండూరు-శంకర్‌గౌడ్‌, ఖమ్మం-రామకృష్ణ, కొత్తగూడెం-సురేందర్‌ రావు, వైరా-సంపత్‌ నాయక్‌, అశ్వారావుపేట- ఉమాదేవి, కోదాడ- సతీష్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో వంగ లక్ష్మణ్‌గౌడ్‌ అనే అభ్యర్థులను పోటీలో నిలిపింది.

Janasena Election Plan in Telangana : ఎనిమిది మందిలో ఇద్దరు మినహా మిగతా ఆరుగురు కొత్త వాళ్లకే అవకాశం కల్పించింది. జనసేన 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో పొత్తును ఇక్కడా కొనసాగించాలని భావించినప్పటికీ.. తెలంగాణలో టీడీపీ(TDP) పోటీ నుంచి తప్పుకుంది. రాష్ట్ర బీజేపీ అగ్రనాయకులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌తో పవన్‌ కల్యాణ్‌ చర్చలు జరిపి ఆయా నియోజకర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నట్లు జనసేనాని(Janasena) ప్రకటించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ(PM Modi)తో కలిసి పాల్గొని ఇరుపార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు - ఏం మాట్లాడతారా అని సర్వత్రా ఆసక్తి!

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీపోటీ చేయడం ఇదే తొలిసారి. 2020లో జరిగిన బల్దియా ఎన్నికల్లో పరోక్షంగా తన ప్రభావాన్ని 48 స్థానాల్లో చూపించి బీజేపీ గెలుపునకు సహకరించింది. కూకట్ పల్లి స్థానాన్ని ఒడిసిపట్టాలనే వ్యూహంతో ప్రేమ్‌కుమార్‌ విజయం కోసం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నాయి. రాష్ట్రంలో జనసేన క్రియాశీలకంగా లేకపోవడం క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవహించింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని పరిమిత స్థానాల్లోనే పోటీకి దిగడం జనసేనపై ఓటర్లలో ఆసక్తి సన్నగిల్లింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి దక్కే ఆదరణ ఎంత అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. యువతకు ఉద్యోగాలు, ఉచిత విద్య, వైద్యం హామీలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

"2014లో తెలంగాణ గడ్డపైన పవన్ కల్యాణ్ జనసేనాని స్థాపించారు. ఈ ప్రాంతంలో ఉన్న చైతన్యాన్ని అన్ని వేదికలో తెలియజేస్తారు. పార్టీ కోసం పని చేసిన వ్యక్తులు నిత్యం కృషి చేస్తేనే పార్టీ నిలబడుతోంది."-నాదెండ్ల మనోహర్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన - 8 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

Pawan Kalyan Campaign in Telangana : తెలంగాణలో జనసేన- బీజేపీ పొత్తు(Janasena bjp Alliance) ఇరు పార్టీలకు ఉభయతారకంగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ పోటీ చేస్తున్న 111 నియోజకవర్గాల్లో జనసేనకు ఉన్న ఓట్లు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. జనసేనతో పొత్తు వల్ల బీజేపీ 40 సీట్లు గెలుస్తామనే ధీమా కనిపిస్తోంది. కూకట్ పల్లితో పాటు తాండూరు సహా మరో రెండు నియోజకవర్గాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

BJP Janasena Alliance Issue 2023 : జనసేనతో బీజేపీ పొత్తు.. కాషాయ నేతలకు తలనొప్పి తెస్తోందిగా..?

BJP Janasena Alliance in Telangana : బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది..! ఇక సీట్ల లెక్క తేలాలి

ABOUT THE AUTHOR

...view details