తెలంగాణ

telangana

ETV Bharat / bharat

janasena : అమిత్​షాను కలిసి.. విశాఖ ఉక్కుపై భావోద్వేగాన్ని తెలిపాం : పవన్ కళ్యాణ్ - ఏపీ ప్రధానవార్తలు

pavan comments on visakha steel plant : ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర పాలకులకు తొలి నుంచీ చిత్తశుద్ధి లోపించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రతి సందర్భంలో కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులతో చర్చించినపుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలని బలంగా చెప్పామని పవన్ స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రం ఈ అంశంలో స్పందించడంతో రాజకీయ ప్రయోజనాలతో వైఎస్సార్సీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారు తప్ప.. పరిశ్రమను కాపాడుతామనే మాట చెప్పలేకపోయారని మండిపడ్డారు.

విశాఖ స్టీల్ ప్లాంటుపై పవన్ కళ్యాణ్ ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంటుపై పవన్ కళ్యాణ్ ప్రకటన

By

Published : Apr 13, 2023, 5:47 PM IST

visakha steel plant : విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రమంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలనే చిత్తశుద్ధి లేదని పవన్ విమర్శించారు. విశాఖ ఉక్కు.. తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, విశాఖ ఉక్కుపై దిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడానని తెలిపారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలు వద్దన్నప్పుడు బీజేపీ నాయకులు సానుకూలంగా స్పందించారని పవన్‌ వెల్లడించారు. విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన పరిశ్రమ అని తెలిపారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా సిద్ధించినదే విశాఖ ఉక్కు పరిశ్రమ అని... ఇంతటి ఘన నేపథ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రకటన వచ్చినపుడు.. వెంటనే స్పందించి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసినట్లు పవన్ వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ని కలిసి.. విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న భావోద్వేగ బంధాన్ని తెలియజేసి ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరాం అని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదని, దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు అని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్ సింగ్ చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారని పేర్కొన్న పవన్.. ఇలాంటి పరిశ్రమపై రాష్ట్ర పాలకులు సైతం ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించింది... రాష్ట్ర పాలకులకు తొలి నుంచీ చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలవడంతోపాటు.. భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర పాలకులు అఖిల పక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని విజ్ఞప్తి చేశాం అని గుర్తు చేశారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ పాలకులు స్పందించలేదని తెలిపారు. జనసేన పార్టీ ప్రతి సందర్భంలో కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులతో చర్చించినపుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలని బలంగా చెప్పామని పవన్ స్పష్టం చేశారు. కొద్ది రోజుల కిందట పొరుగు రాష్ట్రం ఈ అంశంలో స్పందించిందని, దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైఎస్సార్సీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారు తప్ప.. పరిశ్రమను కాపాడుతామనే మాట చెప్పలేకపోయారని మండిపడ్డారు. చిత్తశుద్ధి లేని రాష్ట్ర పాలకుల వల్ల విశాఖ ఉక్కు పరిశ్రమ అంశం ముందుకు వెళ్లడం లేదని, కానీ, కేంద్ర మంత్రి ప్రకటన కొత్త ఆశలు రేపిందని పేర్కొన్నారు.

భావోద్వేగాన్ని చెప్పాను.. అమిత్ షాను కలిసి విశాఖ ఉక్కుతో తెలుగు భావోద్వేగాన్ని తెలిపాను.. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరాం అని పవన్ వివరించారు. రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్రం వద్దకు వెళ్లాలని కోరాం అని గుర్తు చేస్తూ.. కేంద్రం వద్దకు వెళ్లాలనే ప్రతిపాదనపై వైఎస్సార్సీపీ నేతలు స్పందించలేదని మండిపడ్డారు. కొద్ది రోజులుగా పొరుగు రాష్ట్రం తెలంగాణ.. విశాఖ ఉక్కుపై స్పందిస్తోందన్న పవన్.. వైఎస్సార్సీపీ నేతలు పరిశ్రమను కాపాడతామనే మాట చెప్పలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి లేని రాష్ట్ర పాలకులు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణపై ముందుకెళ్లలేదని అన్నారు. కేంద్రమంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపిందని, జనసేన తొలి నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కోరుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details